బాలయ్య బాబు కెరియర్ లో ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకున్నాయి. నిజానికి ఈయన చేసిన ప్రతి సినిమా లో కూడా ఏదో ఒక కొత్త దనం ఉండేలా బాలయ్య బాబు చూసుకుంటారు అయితే ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు బాలయ్య బాబు అన్ని రొటీన్ సినిమాలు చేస్తున్నాడు అని చాలా మంది బాలయ్య బాబు మీద విమర్శలు కూడా చేస్తూ ఉంటారు.నిజానికి ఈయన ఈ మధ్య చేసిన చాలా సినిమాలు ఒకే జానర్ లో ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.

  కానీ ఒకప్పుడు బాలయ్య చాలా ప్రయోగాలు చేసాడు జానపద చిత్రా ల్లో నటిస్తూనే సైన్స్ ఫిక్షన్ సినిమా అయిన ఆదిత్య 369 కూడా చేసాడు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో ఆయన రెండు పాత్రల్లో సూపర్ గా నటించి మంచి పేరు సంపాందించుకున్నాడు.అలాంటి బాలయ్య ఇప్పడూ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు. అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.నిజానికి బాలయ్య చేసే సినిమాల విషయం లో అతని ఫ్యాన్స్ కూడా కొంత వరకు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు...  అయితే ప్రస్తుతం బాలయ్య నటన కి స్కోప్ ఉండే సినిమాలు తీస్తే చూడాలి అని చాలా మంది అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు...ఎందుకంటే బాలయ్య ఒక మంచి నటుడు కానీ ఆయన లోని నటుడుని ఎవరు బయటికి తీయడం లేదు అనేది మాత్రం వాస్తవం...మళయాళం లో వచ్చిన భీష్మ పర్వం లాంటి సినిమా అయిన బాలయ్య కి బాగుంటుంది అలాంటి సినిమాలు చేయకుండా ఎప్పుడు భారీ డైలాగులు చెప్తూ, మనుషూల్ని నరికే సినిమా లు చేయడం ఎందుకని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు...వాళ్ల ఫ్యాన్స్ కోరిక మేరకు ఇప్పటి కై నా బాలయ్య కొత్త తరహా సినిమాలు చేస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: