ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే పుష్ప ది రైస్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ ని వచ్చే సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ లోనూ ... సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో మూవీ లోనూ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కాకపోతే త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ కావడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సందీప్ రెడ్డి మూవీ కూడా స్టార్ట్ కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దానితో పుష్ప పార్ట్ 2 మూవీ తర్వాత అల్లు అర్జున్సినిమా స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ప్రస్తుతం అనేక మంది తమిళ దర్శకులు ఉత్సాహాన్ని చూపిస్తున్నట్లు సమాచారం.

అందులో భాగంగా ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ ,  లింగు సామి , పుష్కర్ గాయత్రి , అట్లీ వీరితో పాటు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా అల్లు అర్జున్ కి కథలను వినిపించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అల్లు అర్జున్ వీరిలో నెల్సన్ దిలీప్ కుమార్ తో స్పీడ్ గా ఓ మూవీ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: