టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటివల రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాడు. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా పాన్ ఇండియా హిట్ కొట్టాలి అని త్వరలోనే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. రవితేజ కెరియర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. దీంతో సినిమాపై ఆడియన్స్ లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్ అంతా ట్రైలర్ కోసం ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు.

 ఈ క్రమంలోనే 'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్ రిలీజ్ ను రవితేజ ఫ్యాన్స్ కే వదిలేసారు మూవీ టీం. ఫ్యాన్స్ ఎప్పుడంటే అప్పుడే ట్రైలర్ రిలీజ్ చేస్తామని తాజాగా మూవీ టీం ప్రకటించింది. ఈ సినిమాని నిర్మిస్తున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ తన సోషల్ మీడియా వేదికగా టైగర్ నాగేశ్వర్ రావు ట్రైలర్ లాంచ్ కోసం రెండు డేట్స్ ని ఫిక్స్ చేస్తూ ఓ పోల్ ని కండక్ట్ చేశారు. ఈ రెండు డేట్స్ లో ఏ డేట్ కి టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ ని రిలీజ్ చేయాలో ఫ్యాన్స్ డిసైడ్ చేయాలంటూ నిర్మాత అభిషేక్ కోరగా.. ఎక్కువ మంది ఫ్యాన్స్ మాత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపించారు. 

దీంతో ఈ తేదీనే ఫైనల్ చేస్తూ 'టైగర్ నాగేశ్వర్ రావు' ట్రైలర్ సెప్టెంబర్ 27న విడుదల కానుందంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మాస్ రాజా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సినిమా ట్రైలర్ రిలీజ్ విషయంలో ఇలా ఫ్యాన్స్ అభిప్రాయాన్ని మూవీ టీం కోరడం, వాళ్ళ నిర్ణయం ప్రకారమే ట్రైలర్ విడుదల చేయడం విశేషం అనే చెప్పాలి. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్ హీరోయిన్గా నటిస్తోంది. రవితేజ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: