కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తను ఒక్కడే కాదు చుట్టుపక్కల వాళ్లంతా క్రమశిక్షణగా ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటాడు ఆయన. అలా లేకపోతే వారిపై ఎంతలా సీరియస్ అవుతారో చాలా సందర్భాల్లో మనం చూసాం. అయితే తాజాగా మరోసారి మోహన్ బాబు చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. బుధవారం (సెప్టెంబర్ 20) ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మోహన్ బాబు సైతం సందడి చేశారు. ఈ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై, ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. 

మహేష్ బాబు, రామ్ చరణ్, నాని, మంచి విష్ణు తదితరులు ఈ వేడుకలో కనిపించారు. అఖిల్, సుశాంత్, నాగచైతన్య, సుమంత్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అఖిల్ రామ్ చరణ్ ను దగ్గరుండి మరీ తీసుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో మోహన్ బాబు సీనియర్ నటి జయసుధ పై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏఎన్ఆర్ గురించి అతిధులు ఓవైపు మాట్లాడుతూ ఉంటే జయసుధ మాత్రం ఫోన్ లో బిజీగా ఉంది. అది చూసిన మోహన్ బాబు జయసుధ పై సీరియస్ అయ్యారు. అంతేకాదు కోపంతో ఆ ఫోన్ ను లాక్కుందామని ప్రయత్నించారు. ఆ సమయంలో జయసుధ నవ్వుతూ కనిపించారు.

 ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 'ఏఎన్ఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఫోన్ చూడటం కరెక్ట్ కాదు కదా. మోహన్ బాబు చేసింది కరెక్టే' అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక మోహన్ బాబు ఈ కార్యక్రమంలో ఏఎన్నార్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు." ఏఎన్ఆర్ గురించి మాట్లాడాలంటే పెద్ద పుస్తకమే రాయచ్చు. తిరుపతిలో చదువుకునే రోజుల్లో ఏఎన్ఆర్ గారి సినిమాల కోసం చుక్కలు చించుకునే వాళ్ళం. మళ్లీ ఆ చొక్కాలు కుట్టించుకునేందుకు డబ్బులు కూడా ఉండేవి కాదు అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: