సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష రెండు దశాబ్ధాలుగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. అమ్మడు ఈమధ్య మళ్లీ సూపర్ ఫాం కొనసాగిస్తుంది. 20 ఏళ్లుగా సినిమాలు చేస్తూ వస్తున్న త్రిష అప్పటికీ ఇప్పటికీ అంతే అందంగా కనిపిస్తుంది. కెరీర్ విషయంలో దూసుకెళ్తున్న త్రిష తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ముందడుగు వేయట్లేదు. పెళ్లి విషయంలో త్రిష ఇంకా లేట్ చేస్తుంది. దీనికి రీజన్స్ ఏంటన్నది మాత్రం తెలియదు. ఇదిలాఉంటే త్రిష మ్యారేజ్ రూమర్స్ ప్రతిసారి హాట్ న్యూస్ గా మారుతాయి.

లేటెస్ట్ గా త్రిష ఓ నిర్మాతని పెళ్లాడుతుంది అంటూ ఒక న్యూస్ వైరల్ అయ్యింది. ఈ న్యూస్ ఆ నోటా ఈ నోటా చేరి త్రిష దగ్గరకు వెళ్లింది. దీనితో త్రిష కూడా స్పందించాల్సి వచ్చింది. మీరు సైలెంట్ గా ఉండండి అంటూ పెళ్లి పై తన మార్క్ రెస్పాన్స్ ఇచ్చింది త్రిష. అసలు అమ్మడికి ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా అసలు పెళ్లి చేసుకునే ఆలోచన లేదా అన్నది తెలియాల్సి ఉంది.

త్రిష పెళ్లి టాపిక్ ఎప్పుడు వచ్చినా సరే దాన్ని స్కిప్ చేస్తూ వేరే టాపిక్ మాట్లాడుతుంది. ప్రస్తుతం విజయ్ సినిమాలో నటిస్తున్న త్రిషసినిమా తర్వాత మళ్లీ కోలీవుడ్ లో బిజీ అవ్వాలని అనుకుంటుంది. తమిళంలో సినిమా వెంట సినిమా చేస్తుంది కానీ తెలుగులో ఆఫర్స్ వస్తున్నా మాత్రం అసలు చేయట్లేదు. మరి పెళ్లిపై త్రిష ఆలోచన ఏంటో కానీ ప్రతిసారి ప్లీజ్ సైలెన్స్ అంటూ ఆమె చెప్పడం అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది. దశాబ్ధ క్రితమే అమ్మడు ఓ బిజినెస్ మెన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. మరి త్రిషకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: