యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ kgf డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఇంకా ఏదో ఒక పెండింగ్ వర్క్ తో వాయిదా పడుతూ ఉంది. ఇప్పుడు సెప్టెంబర్ నుంచి నవంబర్ కి అంటూ ఇటీవల కాలంలో పుకార్లు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు వచ్చే ఏడాది సమ్మర్ కి వెళ్లిపోతోంది అంటున్నారు. ఇంకా ఈ సినిమాకు రెండో పార్టు కూడా ఉందిి.అయితే ఫస్ట్‌ పార్ట్‌ సెప్టెంబరు 28 వ తేదిన విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతోందని టీమ్‌ చాలా ఆలస్యంగా చెప్పింది. అయితే నవంబరు ఆఖరున సినిమా రావొచ్చని అనధికారిక వార్తలు శాండిల్‌వుడ్‌ ఇండస్ట్రీ నుండి వచ్చాయి. అయితే ఇప్పుడు అది కూడా కష్టమే అంటున్నారు. దీనికి కారణంగా రెండు, మూడు రకాల విషయాలు వినిపిస్తున్నాయి. అందరూ అంటున్నట్లు ఈ సినిమా రైట్స్‌ విషయంలో నిర్మాణ సంస్థ ఇంకా ఓ నిర్ణయంని తీసుకోలేదు.


ఇంకా అలాగే విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలోనూ దర్శకుడు ప్రశాంత్‌ నీల్ సంతృప్తిగా లేరని కూడా అంటున్నారు. దీంతో ఈ సినిమాను వాయిదా వేశారు అని మేకర్స్ చెబుతున్నారు. 'ఆదిపురుష్‌' సినిమా డిజాస్టర్‌ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోమని అడుగుతున్నారట. అందువల్ల నవంబరులో కానీ, డిసెంబరులో కానీ 'సలార్‌'ను తీసుకొచ్చే పరిస్థితి లేదని సమాచారం తెలుస్తుంది.అందుకే ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌ సీజన్‌ కి తీసుకొస్తే బెటర్‌  అనే మాట డిస్ట్రిబ్యూటర్ల నుండి వస్తోంది. దీంతో ఈ సినిమాను 2023లో కాకుండా 2024లో విడుదల చేసే ప్రయత్నాల్లో మేకర్స్ ఉన్నారు అని అంటున్నారు. అందుకే మొన్నీమధ్య వచ్చిన ఓ లెటర్‌లో కూడా ఆ విషయం చెప్పలేదు అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ పక్కా రానుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: