టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ పరంగా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. అయితే మహేష్ బాబు తన సినీ కెరియర్లో ఇప్పటివరకు పాతిక సినిమాలకి పైగా నే చేశాడు. ఆ సినిమాల్లో కొన్ని సినిమాలు హిట్లుగా కొన్ని బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే

 మరికొన్ని సినిమాలో మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అని ముందే పసిగడితే ఆ సినిమా జోలికి వెళ్లడానికి ఏ సినీ సెలబ్రిటీ అయినా ఇష్టపడరు. అటువంటిది మహేష్ బాబు తన కెరీర్లో ఫ్లాప్ అవుతాయని తెలిసిన రెండు సినిమాలని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఆ సినిమాల్లో బ్రహ్మోత్సవం సినిమా ఒకటి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సమంత కాజల్ అగర్వాల్ ప్రణీత సత్యరాజ్ ప్రకాష్ రాజ్ జయసుధ వంటి చాలామంది సినీ సెలబ్రిటీలో నటించారు. 2016 లో విడుదలైన ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది.

ఇక బ్రహ్మోత్సవం సినిమా కంటే ముందే మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక అదే సమయంలో ఒక ఫ్యామిలీ స్టొరీ ఉంది అని చెప్పడంతో ఆయనపై ఉన్న నమ్మకంతో మహేష్ బాబు ఈ సినిమా కథ వినకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫైనల్ గా బ్రహ్మోత్సవం సినిమా స్టార్ట్ అయి సగం షూటింగ్ పూర్తయిన తర్వాత పూర్తి స్క్రిప్ట్ చూసిన మహేష్ బాబు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కచ్చితంగా ఈ సినిమా ఫ్లాప్ అనే ముందే ఊహించాడు కానీ అప్పటికే సగానికి పైగానే బడ్జెట్ పెట్టడంతో పాటు షూటింగ్ పనిలో బిజీగా ఉండడంతో ఏం చేయలేకపోయాడు. అలా ఈ సినిమా ఫ్లాప్ అయింది. అనంతరం స్పైడర్ సినిమా సైతం ఇలాగే ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా కూడా పూర్తి స్క్రిప్ట్ వినకుండా డైరెక్టర్ మురుగదాస్ పైన నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: