
వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన సూర్యతో బోయపాటి చిత్రం అంటే అంచనాలు భారీగా ఉంటాయి. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'కంగువా' చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాతే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట. ఎలాంటి పాత్రలకు అయిన ఒదిగిపోతారు సూర్య. మాస్ యాక్షన్ అంశాల మేళవింపుతో హీరో ఎలివేషన్స్‌తో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తారు బోయపాటి. వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతోంది? సూర్యను తెరపై ఎలా ఆవిష్కరిస్తారా? అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో నెలకొంది.
అయితే ఈ చిత్రంపై తెలుగు, తమిళ భాషల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న 'కంగువా' చిత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ఎంతగానో అలరించింది. పది భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం త్రీడీలోనూ ప్రేక్షకుల్ని అలరించనుంది. సూర్య సరసన బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.