
ముందుగా ఈ సినిమా కోసం ఏ.ఆర్ రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా అనుకున్నారట. కానీ పలు కారణాల వల్ల ఆయనను బదులుగా దేవి శ్రీ ప్రసాద్‌ను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దేవిశ్రీ తో చర్చలు కూడా జరిపారని సమాచారం.. ఇక దేవి ఈ ఏడాది వచ్చిన వాల్తేరు వీరయ్య తర్వాత ఇప్పటివరకు మరో సినిమా అయితే చేయలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో తెలుగులో పుష్ప సీక్వెల్‌తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలు ఉన్నాయి. అలాగే తమిళంలో కంగువా, విశాల్34 సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ధనుష్ సినిమా కూడా దేవి మ్యూజిక్ లిస్ట్‌లోకి చేరిపోయింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా ఓ యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. అంతేకాకుండా సమాజంలోని ఆర్థిక అసమానతలను గురించి కూడా చర్చించే విధంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. అలాగే నాగార్జున కీలకపాత్ర పోషిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు వున్నాయి. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.