
అయితే ఈ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్నాడు శేఖర్ కమ్ముల. ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేసి అటు సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారూ అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చక చక జరుగుతున్నాయి అన్నది తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబో సినిమా కోసం ముందుగా అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ను మారుస్తున్నారట. ముందుగా ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ను సంగీత దర్శకుడుగా అనుకున్నారట. కానీ ప్రస్తుతం పలు కారణాలవల్ల ఆయనకు బదులుగా దేవిశ్రీ ప్రసాద్ ను రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే దేవిశ్రీ తో జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాడట. అయితే వాల్తేరు వీరయ్య తర్వాత దేవి ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. అయితే ప్రస్తుతం దేవి చేతులో పుష్ప 2 తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. ఈ యదార్థ సంఘటన ఆధారంగా శేఖర్ కమ్ముల ఇక ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట.