
ఇప్పుడు వీరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడంతో అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లోకి వెళ్లిపోయాయి. అయితే ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కూడా మూవీపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది అని చెప్పాలి. ఇక అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇక ఈ మూవీలో దళపతి విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇక సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ కూడా ప్రమోషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఈ మూవీకి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది.
దళపతి విజయ్ లియో మూవీ రన్ టైం లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ మూవీ రెండు గంటల 39 నిమిషాల రన్ టైం కలిగి ఉంటుందని తెలుస్తుంది. కాగా సెవెన్ స్క్రీన్ స్టూడియో ఇక ఈ మూవీని నిర్మిస్తూ ఉండగా.. యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన పాటలు సోషల్ మీడియాలో సెన్సేషనల్ సృష్టించాయి అని చెప్పాలి. కాగా లోకేష్ కనకరాజు మరోసారి లియో మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడం ఖాయం అని అటు సినీ ప్రేక్షకులందరూ కూడా అంచనా వేస్తూ ఉన్నారు.