సంక్రాంతి పండుగకు విడుదల అయ్యే సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసి మంచి వసూళ్లు సాధిస్తాయి. ఈ ఏడాది సంక్రాంతి కి బాలయ్య వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, అలాగే విజయ్ దళపతి వారసుడు సినిమాలు విడుదల అయి మంచి కలెక్షన్స్ రాబట్టాయి.ఇక వచ్చే సంక్రాంతికి కూడా రసవత్తర పోటి నెలకొననుంది..సంక్రాంతి పండుగ ఇంకా మూడు నెలలకి ఉండటంతో ఇప్పటి నుంచే కొన్ని మూవీస్ అప్పటికి స్లాట్‌లు బుక్ చేసుకుంటున్నాయి.తెలుగు సినిమాలకు పోటీగా ఈ సంక్రాంతికి ఓ తమిళ్ సినిమా రాబోతుంది.

ఈ మధ్యనే మహావీరుడుతో తెలుగులో మంచి హిట్టు కొట్టిన శివ కార్తికేయన్ ఇప్పుడు అయాలన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. సై-ఫై కామెడీ డ్రామా నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆర్‌. రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ కూడా పూర్తయింది. ప్రస్తుతం మేకర్స్‌ ఈ సినిమా సీ.జీ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు.తాజాగా మేకర్స్‌ ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా వదిలారు. ఏలియన్‌ షిప్‌ నుంచి ఏలియన్‌ కిందకి పడుతున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌తోనే అంచనాలు భారీగా పెరిగాయి.

ఇక్కడ  ఈ సినిమాపై అంత బజ్‌ లేదు కానీ.. తమిళనాట మాత్రం మాములు హైప్‌ లేదు. తొలిసారి హాలీవుడ్‌ రేంజ్‌ సినిమా వస్తుందని అక్కడి ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఏర్‌. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 24AM స్టూడీయోస్‌ బ్యానర్‌పై ఆర్‌.డీ.రాజా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో శివ కార్తికేయన్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తుంది.సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: