ఇటీవల కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్లకే విడాకులు తీసుకోని విడిపోవడం చాలా కామన్ అయ్యిపోయింది. ఇక సెలబ్రిటీస్ విషయానికి వస్తే.. ఇది చాలా ఎక్కువుగా ఉంది.కోట్లు ఖర్చుపెట్టి ఘనంగా పెళ్లి చేసుకోవడం, పలు వేదికల పై క్యూట్ కపుల్ గా సందడి చేయడం, ఏడాది గడవక ముందే విడాకులతో విడిపోవడం జరుగుతుంది. తాజాగా ఈ ప్రేమ పెళ్లిళ్లు, విడాకులు విషయం పై టాలీవుడ్ స్టార్ నటుడు జగపతిబాబు వైరల్ కామెంట్స్ చేశాడు.రీసెంట్ గా జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా, ఆయనని ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ప్రశ్నించారు. జగ్గూభాయ్ బదులిస్తూ.. "ఈ జనరేషన్స్ లో ఒక పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలబడడం లేదు. కష్టాలొచ్చిన సమయంలో ఒకరి కోసం ఒకరు నిలబడలేకపోతున్నారు. ఇప్పటి వారికీ ప్రేమించుకోవడం ఒక సరదా అయ్యిపోయింది. దానిని ఎవరూ ఎమోషనల్ గా తీసుకోవడం లేదు. ప్రేమకి, పెళ్ళికి ప్రస్తుతం విలువ లేదు" అంటూ వ్యాఖ్యానించాడు.

అసలు ప్రేమ అనేది ఎప్పుడో చచ్చిపోయిందని, పెళ్ళైన కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం, దానిని కూడా పార్టీలు నిర్వహించి సెలబ్రేట్ చేసుకోవడం ఫ్యాషన్ అయ్యిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటి జనరేషన్ వారికీ జగపతిబాబు పెళ్లి చేసుకోవద్దు అనే సలహా ఇస్తానని పేర్కొన్నాడు. ఈక్రమంలోనే తన చిన్న కూతురిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పినట్లు వెల్లడించాడు. ఇక అంతా తన ఇష్టమే అంటూ తనకే వదిలేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జగపతిబాబు కామెంట్స్ వైరల్ గా మారాయి.


ఇక జగపతిబాబు సినిమాలు విషయానికి వస్తే.. ఫ్యామిలీ హీరో నుంచి విలన్ గా టర్నింగ్ తీసుకున్న జగ్గూభాయ్ నార్త్ టు సౌత్ విలన్ పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ప్రస్తుతం జగపతిబాబు టాలీవుడ్ లోని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. మహేష్ బాబు 'గుంటూరు కారం', ప్రభాస్ 'సలార్', అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాలతో పాటు ఇతర భాషల్లో కూడా నటిస్తూ మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్ గా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: