ప్రముఖ టాలీవుడ్ నటి జయలలిత గురించి ప్రత్యేకం గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలయ్య గారు చిన్నపిల్లాడు అని ఆయన బాగా మాట్లాడతారని ఆమె చెప్పుకొచ్చారు.40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఏం సంపాదించక పోయినా అభిమానం సంపాదించానని జయ లలిత కామెంట్లు చేశారు. బాలయ్య బాబు ను టీజర్ రిలీజ్ చేయాలని కోర గా మొదట అంగీకరించారని రెండు రోజుల తర్వాత ఫోన్ చేస్తే జలుబు చేసిందని చెప్పారని జయలలిత అన్నారు. అదే సమయం లో బాలయ్య మూవీ షెడ్యూల్ మొదలవుతూ ఉండటం తో నేను కూడా ఆయనను ఫోర్స్ చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. టీవీ లో సినిమాలు వచ్చినా బాలయ్య సంతోషిస్తారని లారీ డ్రైవర్ వేశారని నాతో చెబుతారని జయలలిత కామెంట్లు చేశారు. నాకు ఏ ఆర్టిస్ట్ తో గొడవలు లేవని ఆమె అన్నారు. నాకు సోషల్ మీడియా గ్రూప్స్ లో ఉండనని జయ లలిత అభిప్రాయం వ్యక్తం చేశారు.

 హలో అంటే హలో చెబుతానని నా పనేదో నేను చూసుకుంటానని ఆమె అన్నారు. నాకు ఒక పదిమందిని చూస్తే భయం అని జయ లలిత పేర్కొన్నారు. నేను ఎక్కువ మంది జనాలను చూస్తే భయమని ఆమె కామెంట్లు చేశారు. అమ్మ చనిపోయిన సమయంలో కంటి నుంచి కన్నీటి చుక్క రాలేదని జయలలిత చెప్పుకొచ్చారు. ఇంట్లో నన్ను అందరూ పాపాయి అని పిలుస్తారని ఆమె పేర్కొన్నారు.మోహన్ బాబు గారు పలకరిస్తారని అభిమానిస్తారని ఆమె కామెంట్లు చేశారు. ఆయన టైటిల్ లాంఛ్ చేశారని జయలలిత కామెంట్లు చేశారు. షాట్ గ్యాప్ లో నేను డ్రెస్ కప్పుకునేదానిని కాదని ఆమె అన్నారు. నాకు బోలెడు లవ్ ప్రపోజల్స్ వచ్చాయని ఆమె తెలిపారు. జయలలిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జయలలిత రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్రలను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: