తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం మరో మైలురాయి చేరుకుంది. చిరంజీవి నట ప్రస్థానానికి 45 సంవత్సరాలు నిండాయి. ఆయన నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు  1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై నేటితో (2023 సెప్టెంబర్ 22) 45 ఏళ్లు పూర్తయ్యాయి. తన అద్భుతమైన సినీ ప్రస్థానంలో ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, రికార్డులు సృష్టించారు చిరంజీవి. ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. అలాగే ఇప్పటికీ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు 155 చిత్రాలు చేసిన ఆయన 70 పదుల వయసుకు దగ్గర పడుతున్నా వరుస సినిమాలతో

 ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ ఏడాది ఏకంగా రెండు సినిమాలు చేశారు. అలా మెగాస్టార్ సినీ ప్రస్థానం అప్రతిహతంగా సాగుతూనే వస్తోంది. నేటితో ఆయన సినీ ప్రస్థానానికి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మెగాస్టార్ సినీ జర్నీ పై ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగమైన పోస్ట్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ పోస్ట్    చేస్తూ.." సినిమాల్లో 45 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ప్రియమైన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అద్భుతమైన ప్రయాణం! ప్రాణం ఖరీదు తో మొదలుపెట్టి ఇంకా మీ అద్భుతమైన పర్ఫామెన్స్ లో కొనసాగుతూనే ఉన్నాయి. తెరపై నటనతో, బయట మానవతా కార్యక్రమాలతో రెండింటితోను కోట్లాదిమందికి మీరు స్ఫూర్తిగా ఉంటున్నారు. మాలో క్రమశిక్షణ, కష్టపడేతత్వం, అంకిత భావం, సమర్థత.. 

అన్నింటికన్నా దయాగుణం లాంటి విలువలను నింపిన నాన్నగారికి ధన్యవాదాలు" అని రాస్కొచ్చారు రామ్ చరణ్. అలాగే చిరంజీవి నటించిన వివిధ పాత్రలకు సంబంధించిన ఫోటోలతో కూడిన ఓ పోస్టర్ను కూడా తన పోస్ట్  కి జత చేశాడు. దీంతో రామ్ చరణ్ పోస్ట్    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు చిరంజీవి సినీ ప్రస్తానానికి 45 సంవత్సరాలు నిండడంతో సినీప్రముఖులు, అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఆయనకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ఆయన నటించిన 'వాల్తేరు వీరయ్య', 'భోళాశంకర్' సినిమాలు విడుదల కాగా, 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: