టాలెంటెడ్ యాక్టర్ గోపీచంద్‌ - సీనియర్ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో వస్తున్న మొదటి చిత్రమిది. రీసెంట్గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో చాలా లాంఛనంగా ప్రారంభమైంది.ఈ సినిమా షూటింగ్‌ సౌత్ ఇటలీలోని మాంటెరాలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్  తెలిపారు. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ను  ఇక్కడ చిత్రీకరించనున్నారట. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారని తెలిసింది. చిత్రలయం స్టూడియోస్ బ్యానర్లో ఫస్ట్ క్లాస్ ప్రొడక్షన్ ఇంకా హై టెక్నికల్ స్టాండర్డ్స్తో నిర్మిస్తున్నారు. వేణు దోనెపూడి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొత్తం సినిమా షూటింగ్ చాలా దేశాల్లోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించనున్నారట. డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమాను శ్రీను వైట్ల తీర్చిదిద్దనున్నారని తెలిసింది. ప్రముఖ రచయిత గోపీ మోహన్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించనున్నారు. గతంలో శ్రీను వైట్ల తెరకెక్కించిన పలు సినిమాలకి ఆయన పనిచేశారు.


 'వెంకీ', 'ఢీ', 'దుబాయ్ శీను' చిత్రాలకు గోపి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు 'రెడీ', 'కింగ్', 'నమో వేంకటేశ', 'బ్రూస్ లీ' సినిమాలకు కథలను కూడా అందించారు.అలాగే గోపీచంద్ నటించిన 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలకు కూడా ఆయన పని చేశారు.'ఆర్ఎక్స్ 100', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం', 'మన్మథుడు 2', 'వినరో భాగ్యము విష్ణు కథ'తో పాటు ఇతర సినిమాలకు పని చేసిన మ్యూజిక్ అందించిన చైతన్ భరద్వాజ్  గోపిచంద్-శ్రీనువైట్ల సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సీనియర్ ఆర్టిస్ట్ కెవి గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకోనున్నారు. చూడాలి మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న గోపిచంద్ - శ్రీనువైట్ల ఈ సారి ఎలాంటి కథతో రాబోతున్నారో, ఈ సినిమా వీరిద్దరికి ఎటువంటి రిజల్ట్ను అందిస్తుందో.శ్రీను వైట్ల కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే 'దూకుడు' మూవీనే. సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ఈ సినిమా 2011 లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా తరువాత శ్రీనువైట్ల చేసిన సినిమాలన్నీ ప్లాప్ గా నిలిచాయి. మరి ఈ సినిమా ఆయనకి మంచి హిట్టుని ఇస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: