బోయపాటి దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా స్కంద. రోజురోజుకి ఈ సినిమాపై అంచనా లు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా బుకింగ్స్ ఇప్పటికీ మొదలు కాగా హైదరాబాదులో బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అదర్స్ గా జరుగుతున్నాయి. శ్రీ లీల ఈ సినిమాలో నటించినందుకు ఈ సినిమాకి మరింత ప్లస్ అయింది అంటున్నారు సినీ లవర్స్. ఇక ఈ సినిమా నుండి మరొక ట్రైలర్ విడుదల కాబోతుంది అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది కానీ ఆ ప్రచారంలో ఎటువంటి నిజం లేదు అని తేలిపోయింది.

స్కంద సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్ అనేలా ఉండబోతుంది అని.. ఆ ట్విస్ట్ తో అప్పటివరకు చూసిన సినిమాపై అభిప్రాయం పూర్తిగా మారబోతుంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రామ్ రెండు షేడ్స్ లో కనిపించబోతున్నట్లుగా .. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని ఇప్పటికే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కాగా ఇందులో సన్నివేశాల కోసం ఎంతో కష్టపడ్డాను అని రాం ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా తెలియజేశారు. ఇక ఇందులో ఎమోషన్స్ సన్నివేశాలు సైతం చాలా అద్భుతంగా ఉండిపోబోన్నట్లుగా తెలుస్తోంది.

 అంతేకాదు బోయపాటి శ్రీనుకి ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్  తన ఖాతాలో పడడం ఖాయమని అంటున్నారు చాలామంది. ఇక బోయపాటి శ్రీను ఈ సినిమా తరువాత సూర్య తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. బోయపాటి శ్రీను ఈ సినిమాతో సక్సెస్ సొంతం చేసుకుంటే ఆయన రెమ్యూనరషన్ సైతం పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.  ఈ సినిమా కోసం సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రామ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎనర్జీ టిక్ స్టార్ రామ్ రేంజ్ ను ఈ సినిమా ఏ రేంజ్ లో పెంచుతుంది అన్నది తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రస్తుతం రామ్ ఒక్కో సినిమాకి గాను 15 కోట్ల రూపాయలను తీసుకుంటున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: