మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు మెగాస్టార్. ఈ సినిమాను మెగాస్టార్ కూతురు సుష్మిత నిర్మిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ సినిమాలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది అని వార్తలు వస్తున్నాయ్. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాలు తెరకెక్కిస్తున్నాము అంటూ ఇటీవల నిర్మాత సుశ్మిత ఒక క్లారిటీ ఇచ్చారు.


 అందుకే నయనతారను ఇక ఈ సినిమాలోకి తీసుకోవాలని ప్లాన్ చేశారు మేకర్స్. అయితే నయనతార ఇటీవల షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా ఇటీవల రిలీజై ఎంత బ్లాక్ బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఇక జవాన్ సినిమాతో నయనతార క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో మెగాస్టార్ సినిమా కోసం నయనతార కొత్త కండిషన్స్ పెట్టడం మొదలుపెట్టిందట. ఇందులో మొదటిది రెమ్యూనరేషన్ రెండింతలు చేసిందట.


 దీంతో నయన్ కి అంత పెద్ద మొత్తంలో పారితోషకం  ఇవ్వలేము అని క్లారిటీ ఇచ్చారట మేకర్స్. దీంతో మెగాస్టార్ సినిమా నుంచి నయనతార తప్పుకుందట  అయితే ఇలా రెమ్యూనరేషన్ విషయం లో నయనతార సినిమా నుంచి తప్పుకుంది అంటే తమ సంస్థకు బ్యాడ్ నేమ్ అని సుష్మిత కొణిదెలా మరోలా వివరణ ఇస్తుందని తెలుస్తుంది. నయనతార వేరే సినిమాలకు డేట్స్ కేటాయించడం వల్ల మా సినిమాకు డేట్స్ ఇవ్వలేకపోయింది. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకొని త్వరలో మరో చిత్రంలో ఆమెతో కలిసి పనిచేస్తాం అంటూ సుస్మిత  చెప్పుకొచ్చింది  అయితే ఇప్పుడు నిజం చెప్పండి మేడం అంటూ నేటిజన్స్ సుష్మితను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: