నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంతకాలం క్రితమే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న బాలయ్య బాబు ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ లో కాజల్ అగర్వాల్ , బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... షైన్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా అక్టోబర్ 19 వ తేదీన విడుదల కావడం కష్టమే అని ... ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పెండింగ్ ఉంది అని ... దానితో ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. దీనిని ఈ మూవీ బృందం తీవ్రంగా ఖండించింది.

ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన చాలా వరకు ఎడిటింగ్ ... డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం పనులను ఈ మూవీ మేకర్స్ పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: