ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలకి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే వస్తోంది ఈ షో. ఈ నేపథ్యంలోనే ప్రతి గురువారం జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ తో అందరినీ అలరిస్తున్నారు కమెడియన్స్. సెప్టెంబర్ 28న ఈటీవీలో ప్రసారం కానున్న జబర్దస్త్ ప్రోమో ని తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో రాఘవ, చంటి, సద్దాం హుస్సేన్, నూకరాజు తమ స్కిట్స్ తో అదరగొట్టేశారు. ఇక ప్రోమోని గమనిస్తే.. రాఘవ స్కిట్ తో ప్రోమో స్టార్ట్ అవుతుంది." కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఏదైనా తినడానికి పట్టుకురా?" అని రాఘవ తన భార్యతో చెప్తే.." ఆమె నీకా? ఎలకలకా? అంటూ పంచ్ వేస్తుంది.

 ఇలాంటి డైలాగులు వేస్తే నాకు మండిపోద్ది' అని రాఘవ చెబితే, ఎక్కడమ్మా? అని భార్య అంటుంది. దానికి రాఘవ ముందు నుంచి వెనక్కి తిరుగుతూ ఇక్కడ! కడుపులో అని చెప్పగానే షో లో ఉన్న వాళ్లంతా నవ్వేశారు." నేను ఏదైనా మనసులో అనుకుంటే అది బయటికి వినబడిపోతుంది. ఇది నాకున్న జబ్బు" అని రాఘవ చెబుతుండగా, "ఇలా మనసులో అనుకున్నవి బయటకు వినబడిపోతే నా జడ్జి పోస్ట్ ఎప్పుడో పోవు అని కృష్ణ భగవాన్ సెటైర్ వేస్తాడు" దానికి ఇంద్రజ అంటే? అని షాకింగ్ గా చూస్తుంది. ఆ తర్వాత వెంకీ స్కిట్ లో భాగంగా భార్య భర్తలు ఇద్దరు గొడవ పడుతుండగా భార్య వెంకీ ని, "వీడు ఇక్కడ ఎగురుతాడు, అక్కడ ఎగరడు?" అని అనగానే దానికి ఇంద్రజ, సౌమ్య పగలబడి నవ్వుతారు. 

ఆ తర్వాత సద్దాం, యాదమ్మ రాజు స్కిట్ లో పంచులు బాగా పేలాయి. 'వైజాగ్ ని వైజాగ్ అని ఎందుకంటారు?' అని అడిగితే.." బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జాగ్ అన్న ఒకడు ఉండేవాడు. అతను ఇంగ్లాండ్ కి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నావ్? వై..జాక్ వై..జాక్? అలా అది వైజాగ్ అయిపోయిందని" సద్దాం హుస్సేన్ చెప్పగానే షోలో నవ్వులు విరిసాయి. ఆ తర్వాత మచిలీపట్నం కి ఆ పేరు ఎలా వచ్చింది అని అడిగితే.." మచిలీపట్నంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక చెల్లి ఉండేది. ఆమెకు ఏదైనా గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాడు. అందుకే ఆ ఊరికి మా చెల్లి పట్నం అని పెట్టేశాడు. అది కాస్త మచిలీపట్నం అయిపోయింది" అని సద్దాం చెప్పగానే కృష్ణభగవాన్, ఇంద్రజ నవ్వారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: