సినీ
ఇండస్ట్రీ అన్న తర్వాత హీరోయిన్ల మధ్య అసూయ అన్నది చాలా కామన్. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల విషయంలో అయితే ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలా చాలామంది స్టార్
హీరోయిన్స్ ఒక్కొక్కసారి ఇతర హీరోయిన్ల పై జలసి తో వారిని పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు.
తాజాగా రష్మిక మందన విషయంలో ఇదే జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, రష్మిక మందన్న ఒకే కార్యక్రమంలో సందడి చేయగా, రష్మిక మందన శ్రద్ధా కపూర్ ని పలకరించినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ప్రముఖ బిలినియర్ ముఖేష్ అంబానీ ఇంట్లో తాజాగా జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు ఈ ఇద్దరు హీరోయిన్లు అటెండ్ అయ్యారు. శ్రద్ధా కపూర్ ఇంటి నుంచి బయటకు వస్తుండగా, రష్మిక లోపలికి వెళ్తోంది. ఆ సమయంలో మీడియా వాళ్ళు ఫోటోలకు రిక్వెస్ట్ చేయడంతో స్మైల్ ఇస్తూ కెమెరాలకు ఫోజులు ఇచ్చింది. ఇక వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న శ్రద్ధా కపూర్ ని చూసి రష్మిక పలకరించింది. కానీ శ్రద్ధ కపూర్ మాత్రం ఏం పట్టించుకోకుండా తలకిందికి వేసుకుని అక్కడ నుంచి వెళ్లిపోవడంతో రష్మిక కాస్త ఇబ్బందిగా ఫీల్ అయింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఇద్దరు హీరోయిన్ల మధ్య ఏదో వైరం నడుస్తుందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైపోయింది. ఈ డిస్కషన్ శ్రద్ధ కపూర్ దాకా వెళ్ళిందో ఏమో తెలియదు కానీ ఆ డామేజ్ ను కంట్రోల్ చేయడానికి శ్రద్ధా కపూర్ తాజాగా రష్మికను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. శ్రద్ధా కపూర్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో రష్మికను ఫాలో అవ్వడంతో పాటు ఓ ఫోటోకి 'వాటే బ్యూటీ' అంటూ కామెంట్ కూడా చేయడం విశేషం. గతంలో ఎప్పుడు రష్మిక పోస్టుల్లో కనిపించని శ్రద్ధా కపూర్.. ఇప్పుడు స్పెషల్ గా రష్మిక పై ఇలాంటి కామెంట్ చేయడంతో శ్రద్ధా కపూర్ ఆ డామేజ్ ని కంట్రోల్ చేయడానికి ఇలా కామెంట్ చేసిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. దీంతో శ్రద్ధా కపూర్ రష్మిక ఫోటో పై పెట్టిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.