నందమూరి నటసింహం బాలకృష్ణ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ లకు సంబంధించిన మూవీ లు ప్రస్తుతం చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాల్లో నటిస్తున్నారు ..? అందుకు సంబంధించిన సినిమా షూటింగ్ లు ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు బాలకృష్ణ మరియు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ పై ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ మూవీవ్లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. సైన్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగార్జున సరసన ఆశిక రంగనాథ్ హీరోయిన్ గా కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ బృందం ప్రస్తుతం నాగార్జున మరియు కొంత మంది ఇతరులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ విజయ్ కెరీయర్ లో 13 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో "విడి 13" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ పై ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: