ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో మరో సారి మల్టీ స్టారర్ ట్రెండ్ మొదలైంది. దీనితో సూపర్ స్టార్ మహేష్ ఈ దర్శకుడికి మరోసారి ఛాన్స్ కూడా ఇచ్చాడు. ఈ సారి మహేష్ తో సోలో హీరోగా బ్రహ్మోత్సవం అనే సినిమా ను రూపొందించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అయితే ఆ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ తో ఆయన సినిమా రూపొందించాడు అంటే ఓ రేంజ్ లో ఉంటుందని అంతా భావించారు. కానీ బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

అసలు కథ లేకుండా సినిమా ఎలా తీశారు అంటూ చాలా మంది దర్శకుడిని ప్రశ్నించారు.ఇదెక్కడి సినిమా అంటూ మహేష్ బాబు తో పాటు అందరిని నెటిజన్స్ విమర్శించారు. మహేష్ బాబు కెరీర్ లో భారీ డిజాస్టర్ గా బ్రహ్మోత్సవం సినిమా నిలిచింది.అంతటి డిజాస్టర్ ఇచ్చిన కూడా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను మహేష్ బాబు ఏ మాత్రం విమర్శించ లేదటా.. తాజాగా శ్రీకాంత్ అడ్డాల తన పెద్దకాపు 1 సినిమా ప్రమోషన్ కార్యక్రమం లో భాగంగా మీడియా తో మాట్లాడుతూ బ్రహ్మోత్సవం సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేష్ బాబు కి ఆ సినిమా పై ఎంతో నమ్మకం ఉండేది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో ఆయన తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేశారు. కానీ నా వద్ద ఏమాత్రం అసహనం తో మాట్లాడలేదని శ్రీకాంత్ అడ్డాల తెలియజేశారు. మనం మంచి ప్రయత్నం చేశాం కానీ వర్క్ అవుట్ అవ్వలేదు.తప్పకుండా మళ్లీ కలిసి వర్క్ చేద్దాం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చారు.

ఒక డిజాస్టర్ ఇచ్చిన కూడా దర్శకుని తో నార్మల్ గా మాట్లాడటం కేవలం మహేష్ బాబుకి మాత్రమే చెల్లుతుంది అంటూ శ్రీకాంత్ అడ్డాల పేర్కొన్నారు. మళ్ళీ మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అంటూ మీడియా వారు ప్రశ్నించగా.. తప్పకుండా మంచి కథ తో మహేష్ బాబు గారితో సినిమా చేస్తా అని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: