ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టాలీవుడ్ లోని స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. అలాంటిది పాన్ ఇండియా హీరో అయినా ప్రభాస్ మాత్రం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నారు. చివరిగా ఆది పురుష్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఫ్యూచర్ సినిమాల ప్రాజెక్టుల పైన చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి సలార్, కల్కి, స్పిరిట్ వంటి చిత్రాలతో పాటు డైరెక్టర్ మారుతీ తో కూడా ఒక సినిమాలో చేయబోతున్నట్లు తెలుస్తోంది.


అయితే ఇప్పటివరకు ప్రభాస్ సినిమాల పరిస్థితి ఓకే కానీ ఇప్పుడు తాజాగా డైరెక్టర్ హనురాగవపూడి సినిమాకి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో ఈ చిత్రం రాబోతోందని ఇది కూడా ప్యూర్ లవ్ స్టోరీ తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ అని కూడా ఏడాది డిసెంబర్ నుంచి మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలుబడుతుందని తెలుస్తోంది.


అయితే ఈ సినిమా నుంచి హీరోయిన్ పేర్లు చాలామంది వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని హీరోయిన్ ఎవరనే విషయం పైన చిత్ర బృందం ఇంకా ఎవరిని ఖరారు చేయలేదని తెలుస్తోంది.. ప్రభాస్ హానురాగవపూడి  కాంబినేషన్ చిత్రాన్ని మైత్రి మూవీస్ మేకర్స్ వారు చాలా గ్రాండ్ గా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో 5 భాషలలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ప్రభాస్ గత చిత్రాలన్నీ పూర్తి చేసిన తర్వాతే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: