తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శ్రీకాంత్ అడ్డాల కొంత కాలం క్రితం విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన నారప్ప అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్  లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే నారప్ప మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు తాజాగా పెద్దకాపు 1 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు రోజే ఈ సినిమాను హైదరాబాద్ ... ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య 70 ఎం ఎం థియేటర్ లలో పెయిడ్ ప్రీపెయిర్స్ వేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టికెట్ లాంజ్ ఈ మూవీ బృందం వారు అందుబాటులోకి తీసుకురాగా ఈ షో టికెట్స్ ఇప్పటికే సోల్డ్ అవుట్ అయ్యాయి. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ ప్రీమియర్స్ కి గనుక మంచి టాక్ వచ్చినట్లు అయితే ఈ మూవీ కి ఓపెనింగ్ రోజు కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: