టాలీవుడ్ యంగ్ హీరోలలో ప్రతిభావంతులైన నటులలో నటుడు సందీప్ కిషన్ కూడా ఒకరు.. ఎప్పుడూ కూడా వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటాడు. తను ఎంచుకున్న పాత్రకి న్యాయం చేయగలిగిన నటుడుగా పేరు సంపాదించారు. అయితే విజయాలు తక్కువగానే ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. ఈ మధ్యకాలంలో సందీప్ నటించిన సినిమాలన్నీ కూడా అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేశాయి. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన మైకేల్ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకొని పూర్తిగా నిరాశకు గురి చేసింది.


ఇప్పుడు సందీప్ చేతిలో ఊరు పేరు భైరవకోన అనే సినిమా ఉన్నది. ఈ సినిమా నుంచి విడుదలైన పాట ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాని IV  ఆనంద్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉన్నది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లోనే ఇప్పుడు మరో కొత్త సినిమా అని మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది నటుడు సందీప్ కిషన్. ఈ చిత్రాన్ని సివి కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. గతంలో మాయావన్ అనే సినిమాని చేశారు.

ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కించబోతున్నారు మంచి టెక్నీషియల్ టీమ్స్ తో ఈ సినిమాకి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. నాని దసరా సినిమాలోని చంకీల అంగీలు వేసుకొని అనే పాటలతో ప్రేక్షకులకు దగ్గర ప్రభాస్ కల్కి సినిమా కోసం పనిచేస్తున్న సంతోష్ నారాయణ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ కి సీక్వెల్స్ పెద్దగా కలిసి రావని సెంటిమెంట్ కూడా ఉన్నది మరి ఈ సీక్వెల్ తో ఈ సెంటిమెంట్లను బ్రేక్ చేస్తారేమో చూడాలి సందీప్ కిషన్. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: