బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కలయికలో రూపొందిన 'స్కంద'మూవీ గురువారం (సెప్టెంబర్ 28) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ ఇంకా మలయాళ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే.అయితే ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ విషయం పక్కన పెడితే, 'స్కంద' మూవీకి సీక్వెల్ కూడా రాబోతుందట. ఇదే విషయాన్ని బోయపాటి శ్రీను మూవీ క్లైమాక్స్ లో సీక్వెల్ గురించి హింట్ ఇవ్వడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా 'స్కంద' క్లైమాక్స్ లో సీక్వెల్ పై అప్డేట్ ఇచ్చి  సర్ప్రైజ్ చేశారు బోయపాటి శ్రీను.సినిమా చివర్లో 'స్కంద' 2 కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం బోయపాటి బాలయ్యతో 'అఖండ' సీక్వెల్ని తెరకెక్కించబోతున్నారు బోయపాటి. దాని తర్వాతే 'స్కంద 2' సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.


అయితే 'స్కంద' మూవీకి సీక్వెల్ ఉంటుందని రిలీజ్ కి ముందు మూవీ టీం ఎక్కడా రివీల్ చేయకుండా ఒక్కసారిగా సినిమా క్లైమాక్స్ లో సర్ప్రైజ్ ఇవ్వడంతో ప్రస్తుతం 'స్కంద' సీక్వెల్ పై చర్చ నడుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ మరోసారి ఊర మాస్ పాత్రలో నటించిన సినిమా ఇది. ఇందులో బోయపాటి రామ్ ని రెండు డిఫరెంట్ వేరియేషన్స్ తో కూడిన క్యారెక్టర్స్ లో చూపించారు.అయితే కథ రొటీన్ గానే ఉన్న సినిమాలో మాస్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, రామ్ ని మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసిన విధానం మెప్పించేలా ఉంది. అలాగే తమన్ BGMతో పాటు శ్రీ లీల గ్లామర్, డాన్స్ లపై కూడా మాస్ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో మెయిన్ హైలెట్ అంటే రామ్ అనే చెప్పాలి. ఎందుకంటే రెండు డిఫరెంట్ వేరియేషన్స్ తో రామ్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసినట్లు తెలుస్తోంది. మాస్ ఆడియన్స్ కి అయితే ఈ సినిమా బాగా నచ్చుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: