బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , విజయ్ దేవరకొండ హీరోలుగా రూపొందుతున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ మూవీలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రదేశంలో జరుగుతున్నాయి ..? ఈ మూవీ బృందాలు ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించిన ఏ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన చివరి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా కాజల్ అగర్వాల్మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో శ్రీ లీల ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం హైదరాబాద్ లోని చిలుకూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.

మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫ్యామిలీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ లో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: