తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నితిన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే నితిన్ తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు అనే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందబోయే తమ్ముడు సినిమా షూటింగ్ ఈ రోజు నుండి ఢిల్లీ లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఢిల్లీ లో ఈ మూవీ షూటింగ్ మూడు రోజుల పాటు కొనసాగనున్నట్లు ఈ మూడు రోజుల్లో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నితిన్ , వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నితిన్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటి మని శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. మూవీ ని డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం వారు ప్రకటించారు. ఈ మూవీ తో పాటు ఇప్పటికే నితిన్ , వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ కూడా మరి కొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: