తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తాజాగా మంగళవారం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఇప్పటికే అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఎక్స్ 100 మూవీ లో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. 

మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ తెలుగు తెరకు పరిచయం అయింది. ఇకపోతే ఆర్ ఎక్స్ 100 మూవీ లో తన అద్భుతమైన నటనతో ... అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ నటికి ఆ తర్వాత తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కాయి. అలాగే ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఇప్పటికే అజయ్ భూపతి  , పాయల్ రాజ్ పుత్ కాంబోలో రూపొందిన ఆర్ ఎక్స్ 100 మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో వీరి కాంబోలో రూపొందిన రెండవ సినిమా అయినటువంటి మంగళవారం మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాను నవంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా ఓవర్ సిస్ హక్కులకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను సౌతెర్న్ స్టార్ ఇంటర్నేషనల్ సంస్థ దక్కించుకున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ తో పాయల్ రాజ్ పుత్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: