నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వీర సింహా రెడ్డి మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇకపోతే బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని షైన్స్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. 

ఇకపోతే ఈ సినిమాని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా బాగా ఎడిటింగ్ మరియు డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అన్ని పూర్తి కాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు.

ఈ సినిమాను ఓవర్ సీస్ లో సరిగమ సినిమాస్ సంస్థ విడుదల చేయబోతున్నట్లు ... అలాగే ఈ మూవీ యొక్క "యూ ఎస్ ఏ" బుకింగ్స్ ను ఓపెన్ చేసినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక పోతే అఖండ , వీర సింహా రెడ్డి లాంటి వరుస విజయాల తర్వాత బాలకృష్ణ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: