నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. సౌర్యవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఖుషి మూవీ కి సంగీతం అందించి ఈ మూవీ తో తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకున్న వషిం అబ్దుల్ వహేబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఓ చిన్న వీడియోను మరియు ఒక పాటను విడుదల చేయగా వీటికి సూపర్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే హాయ్ నాన్న మూవీ ని డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ ని మొదట సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమా విడుదలను వాయిదా వేసి ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

దానితో హాయ్ నాన్న మూవీ మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ లోనే ముందు చెప్పిన తేదీ కంటే ముందే విడుదల చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని డిసెంబర్ 7 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచన ఈ మూవీ మేకర్స్ వచ్చినట్లు అందులో భాగంగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: