మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అఖిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా ... ఈ సినిమాలో కియారా అద్వానీ , చరణ్ సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది.

అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. అలాగే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ కూడా పూర్తయింది. ఇలా ఇప్పటికే ఈ మూవీ చాలా బాగా షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ఈ మూవీ బృందం ప్రకటించలేదు. దానితో ఈ సినిమా విడుదలకు సంబంధించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది.

అందులో భాగంగా ఈ సినిమాను 2025 వ సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లు ప్రస్తుతం వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క అన్ని భాషల మ్యూజిక్ హక్కులను సరిగమ మ్యూజిక్ సంస్థ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే శంకర్ ఈ సినిమాలో పాటలను , యాక్షన్ సన్నివేశాలను అత్యంత గ్రాండ్ గా తేరకెక్కించబోతునట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: