
అయితే అదే రోజున బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన డుంకి చిత్రం కూడా ఈ ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.బాలీవుడ్లో వరుసగా 1000 కోట్లు అందుకున్న షారుఖ్ ఖాన్ ఈసారి ఈ సినిమాతో కచ్చితంగా విజయాన్ని అందుకోవాలని పలు రకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. షారుక్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ వంటి చిత్రాలతో భారీ అంచనాలను క్రియేట్ చేశారు. దీంతో హ్యాట్రిక్ విజయం పైన కన్నేసిన షారుఖ్ ఖాన్ ఈసారి ప్రభాస్ తో ఢీ కొట్టబోతున్నట్లు తెలుస్తోంది. డుంకీ సినిమాకి సలార్ సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఒక వారు జరగడం గ్యారెంటీ అంటూ పలువురు సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు.
లేకపోతే ఆ టైం కి ఏదో ఒక సినిమా వాయిదా పడడం గ్యారెంటీ అన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఓకే డేట్ కి సినిమాలను రిలీజ్ చేస్తే థియేటర్లో విషయంలో చాలా ఇబ్బందులు జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒకప్పుడు షారుక్ ఖాన్ కి ఉన్న ఫామ్ కి ఇప్పుడు ఫామ్ కి చాలా తేడా ఉన్నది. గతంలో షారుఖ్ ఖాన్ చాలా వీక్ గా ఉన్నారు.. పఠాన్ సినిమా తర్వాత మంచి పాపులారిటీ అందుకున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే సలార్ సినిమాకి పర్ఫెక్ట్ పోటీ దొరికినప్పటికీ ఇద్దరిలో ఎవరు వెనకడుగు వేస్తారో చూడాలి మరి.. లేకపోతే ఎవరు వెయ్యి కోట్ల మార్క్ ను అందుకుంటారో చూడాలి.