
గతంలో నిషేధం విధించబడిన క్రికెటర్ శ్రీశాంత్ బిగ్బాస్ హౌస్లో పాల్గొని ప్రేక్షకులను అలరించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ దక్షిణాది బిగ్ బాస్ రియాల్టీ షోలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం తెలుగులో ప్రారంభమైన బిగ్బాస్ ఏడవ సీజన్లో దాదాపు అందరూ కూడా నటులే కంటెస్టెంట్స్ గా వచ్చారు అని చెప్పాలి. అయితే అక్టోబర్ 8వ తేదీ నుంచి మొదలయ్యే కన్నడ సీజన్లో మాత్రం భారత మాజీ బౌలర్ వినయ్ కుమార్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.
వినయ్ కుమార్ టీమిండియా తరఫున 31 వన్డేలు, 9 టీ20 మ్యాచ్ లు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఓవరాల్గా 48 వికెట్లు తీశాడు ఐపీఎల్ లో కోల్కతా, ముంబై, బెంగళూరు జట్ల తరఫున ప్రాతినిత్యం వహించాడు. చివరిసారిగా 2013లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వినయ్ కుమార్ 2021లో క్రికెట్ ఫార్మాట్లు అన్నింటికీ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని ఈ క్రికెటర్ భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే కన్నడ బిగ్ బాస్ సీజన్ లో ఇక హౌస్ లోకి కంటస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడట వినయ్ కుమార్.