తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన హీరోయిన్లలో అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూడా ఒకరు. ఈమె మరణ వార్త ఇప్పటికి ఇండస్ట్రీలో ఆమె అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతూ ఉంటారు. శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్.. ధడక్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఇప్పటికీ బాలీవుడ్ లో పలు సినిమాలలో నటిస్తున్న సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది.


ఇక ఈ ఏడాది ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా ఎంపిక కావడం జరిగింది. అలా సౌత్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది జాన్వీ కపూర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది .ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలోనే సినిమా షూటింగులతో బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో సముద్రపు బ్యాగ్రౌండ్ లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తూ ఉన్నారు.


అయితే ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది.ఎన్టీఆర్ తో నటించాలని కోరిక ఉండడంతో ఇమే సినిమా షూటింగ్ నుంచి ప్రతి రోజు ముంబై నుంచి హైదరాబాద్ కి రావాలి అంటే చాలా ఇబ్బందికరంగా ఉండడంతో తాను ఎక్కడ సినిమాపై కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నానేమో అంటూ భయపడి ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులో రాత్రికి రాత్రి ఏకంగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక ఫ్లాట్ కొని అక్కడి నుంచి షూటింగ్ కి వెళ్తోందట. అయితే తనకు అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్కు తన వల్ల చెడ్డ పేరు రాకూడదని ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: