సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలా మంది కి నచ్చదు ఎందుకంటే ఇక్కడ చేయడానికి అవకాశాలు రావు,వచ్చిన పెద్దగా ఉపయోగం ఉండదు,అలాగే మనకు ఎంత టాలెంట్ ఉన్న కూడా కొన్ని విషయా ల్లో కాంప్రమైజ్ అవ్వక తప్పదు.అందుకే ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది ఇండస్ట్రీ కి ఎందుకు వచ్చామా అని అనుకుంటూ ఉంటారు.ఇక రీసెంట్ గా వచ్చిన సినిమా ల్లో నటిస్తున్న నటులు కూడా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో ఉంటూ వాళ్ళకంటూ ఒక టైం వచ్చేంత వరకు వేసి చూసి ఇప్పుడు ఇండస్ట్రీ లో చిన్న చిన్న గా ఎదుగుతున్నారు అలాంటి వాళ్లలో అరుంధతి అరవింద్ ఒకరు.

ఈయన ఇండస్ట్రీ కి వచ్చి చాలా సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈయన కి ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు సరైన గుర్తింపు రాలేదు అనే చెప్పాలి.ఇప్పటికే ఈయన స్టార్ హీరోలందరి సినిమా ల్లో విలన్ గా నటించిన కూడా ఈయన కి ఒక మంచి నటుడు అనే గుర్తింపు అయితే రాలేదు.ఇక నిజానికి ఈయననే అరుంధతి సినిమా లో విలన్ గా చేయాల్సింది కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఆయన ని తీసి వేసి ఆ ప్లేస్ లోకి సోను సూద్ రావడం జరిగింది.   ఈయన సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఎన్టీయార్ హీరో గా వచ్చిన అశోక్ సినిమా లో మొదటిసారి గా నటించడం జరిగింది.ఈ సినిమా ప్లాప్ అవ్వడం తో ఈయనకి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత బిల్లా లాంటి సినిమా లో కూడా ఒక మంచి పాత్ర పోషించాడు.అయితే అరుంధతి సినిమా లో విలన్ పాత్ర మిస్ అయిన కూడా మరో పాత్ర లోనటించి మెప్పించాడు...ఇక రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమా లో కూడా విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: