
సినిమా ఇండస్ట్రీలో అట్లీది అద్భుతమైన ప్రయాణమని ప్రియ అభిప్రాయం వ్యక్తం చేశారు. అట్లీలా వృత్తి విషయంలో అంకిత భావం, కష్టపడి పని చేసే వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదని ప్రియ చెప్పుకొచ్చారు. హార్డ్ వర్క్, పని విషయంలో గౌరవంతోనే అట్లీ ఈ స్థాయికి చేరుకున్నాడని ఆమె కామెంట్లు చేశారు. ఈ ప్రయాణంలో భాగమై అట్లీతో కలిసి నడుస్తున్నందుకు సంతోషం గా ఉందని ప్రియ పేర్కొన్నారు. అట్లీ లవ్ యూ సో మచ్ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ప్రియ కామెంట్లు చేశారు. ప్రియ వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. అట్లీ, కృష్ణప్రియ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అట్లీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. అట్లీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.