సినిమా ఇండస్ట్రీ లో ఒకరు చేయాల్సిన సినిమా ఇంకొకరు చేయాడం మనం కామన్ గా చూస్తూ ఉంటాం. అయితే కొన్ని నార్మల్ గా అలా జరిగితే, మరికొన్ని మాత్రం కావాలనే అలా చేస్తారు.ఎలా అంటే సుకుమార్ మొదట 100 % లవ్ సినిమాని నటుడు వరుణ్ సందేశ్ తో చేద్దాం అని అనుకున్నాడు కానీ ఆ స్టోరీ ని నాగార్జున విని దాన్ని నాగచైతన్య తో చేసేలా చేసాడు.దాంతో నాగ చైతన్య కి ఒక మంచి హిట్ పడింది.ఇక ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీ లో చాలా జరుగుతూనే ఉంటాయి.

కానీ రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన మరో విషయం ఏంటంటే రవి తేజ చేయాల్సిన ఒక సినిమా ని మంచు విష్ణు చేసాడు.అది ఏ సినిమా అంటే శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఢీ సినిమాని మొదట డైరెక్టర్ శ్రీను వైట్ల రవితేజ తో చేయాలి అని అనుకున్నాడట కానీ ఒక రోజు మోహన్ బాబు శ్రీను వైట్ల ని పిలిచి తన కొడుకు విష్ణు తో ఒక సినిమా చేయమని చెప్పాడట. దాంతో ఆయన ఒకే చేస్తాను అని చెప్పగానే ప్రస్తుతం ఎవరి తో చేస్తున్నావ్ అని అడగగా నేను ఇప్పడూ రవితేజ తో ఒక సినిమా చేస్తున్నాను అని చెప్పాడు.   దాంతో ఆ స్టోరీ ఏంటి ఒకసారి చెప్పు అనగానే శ్రీను వైట్ల మోహన్ బాబు కి ఆ స్టోరీ చెప్పాడు దాంతో ఈ స్టోరీ మోహన్ బాబు కి బాగా నచ్చింది ఇక ఈ సినిమానే మా విష్ణు తో చేయమని చెప్పాడట దాంతో శ్రీను వైట్ల నేనుఅల్రెడీ రవితేజ కి స్టోరీ చెప్పాను సర్ ఆయన నేను కలిసి ఈ సినిమా చేస్తున్నాం.కావాలంటే నెక్స్ట్ సినిమా విష్ణు తో చేస్తాను అని ఎంత చెప్పింన వినకుండా మోహన్ బాబు శ్రీను వైట్ల ముందే రవితేజ కి కాల్ చేసి మాట్లాడి ఇలా విష్ణు చేస్తాడు రవి ఈ కథ ఇచ్చేయమని అనగానే రవి తేజ సరే అని అన్నాడు. ఇక దాంతో శ్రీను వైట్ల కూడా రవితేజ ని పర్సనల్ గా కలిసి అక్కడ జరిగింది చెప్పి మనం నెక్స్ట్ సినిమా చేద్దాం అని అనగానే రవి తేజ కుడా చాలా సంతోషం గా ఒకే అన్నాడట లేకపోతే ఢీ సినిమా కూడా రవితేజ ఖాతాలో పడిపోయి ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: