మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్నో సంవత్సరాలగా ఇండస్ట్రీలో సక్సెస్‌ ఫుల్‌ హీరో గా కెరీర్‌ను కొనసాగిస్తూ వస్తున్నారు..ఈయన మలయాళం మరియు తమిళ్ తో పాటు తెలుగులో కూడా నటించి సూపర్ క్రేజ్‌ ను సంపాదించుకున్నాడు.ప్రస్తుతం ఈ హీరో వరుస చిత్రాలలో నటిస్తూ చాలా బిజీ గా వున్నారు.ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్‌ సినిమా లో కీలక పాత్రలో మెరిశాడు మోహన్‌ లాల్‌. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయం సాధించింది. భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.ప్రస్తుతం మోహన్ లాల్ నటిస్తున్న బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలలోఎంపరాన్ మూవీ కూడా ఒకటి.ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఆరు పదుల వయస్సు దాటినా కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు మాలీవుడ్‌ మెగాస్టార్ మోహన్‌లాల్.

హీరో నటిస్తున్న తాజా చిత్రం ఎంపరాన్.. ఈ మూవీ స్పెషల్ అనౌన్స్ మెంట్ రేపు ఉండబోతుందని తెలియజేశారు మేకర్స్‌. మోహన్‌ లాల్‌ తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ వరుస సినిమా షూటింగ్స్‌ తో బిజీ గా ఉన్నాడు. మోహన్‌ లాల్‌ చేతిలో తెలుగు, మలయాళ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌ వృషభ ఉంది. ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ యాక్టర్‌ రోషన్‌  ముఖ్య పాత్ర లో నటిస్తున్నాడు.మరోవైపు పీరియాడిక్ డ్రామా నేపథ్యం లో వస్తోన్న మలైకోటై వాలిబన్ లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. మ్యాక్స్ ల్యాబ్స్‌-సెంచురీ ఫిలిమ్స్‌ బ్యానర్ల పై జాన్‌-మేరీ క్రియేటివ్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహన్‌ లాల్ మరోవైపు రామ్ : పార్ట్ 1 లో నటిస్తుండగా ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. రామ్ : పార్ట్ 2 కూడా లైన్‌లో ఉంది. వీటితోపాటు మరో మూడు సినిమాల్లో కూడా నటిస్తూ మోహన్ లాల్ ఎంతో బిజీ గా వున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: