
అయితే ఈ సినిమా ముగిసిన వెంటనే ఉప్పెన తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా తో ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుంది అన్నది తెలుస్తోంది. ఇక ఈ సినిమా లో రామ్ చరణ్ డిఫరెంట్ గా చూడవచ్చు అని ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ సినిమా లో హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేస్తారు అనే విషయంపై కూడా గత కొంత కాలం నుంచి చర్చ జరుగుతుండగా.. కొంతమంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి.
ఈ క్రమం లోనే బుచ్చిబాబు సనా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా లో ఒక స్టార్ హీరోయిన్ కూతురు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారి పోయింది. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె ఈశా తాడాని రామ్ చరణ్ మూవీలో హీరోయిన్ గా నటించబోతుందట. ఇక ఈ సినిమాతోనే చిత్రసీమకు పరిచయం అవ్వాలని తల్లి రవీన టాండన్ కూడా అనుకుంటుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది అన్నది తెలుస్తుంది.