మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్ లో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొందునున్న నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ కూడా చేసేశారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా బుచ్చి బాబు చాలా రోజుల క్రితమే ప్రారంభించాడు. అందులో భాగంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సంగీత దర్శకులను ఒకరు అయినటువంటి ఏ ఆర్ రెహమాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక కూడా చేశాడు.

ఇకపోతే ఇప్పటికే రెహమాన్ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే బుచ్చిబాబు , రహమాన్ తో కలిసి ఈ సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్ లలో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెహమాన్ కూడా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ ట్యున్ ఇవ్వగా ఈ మూవీ మేకర్స్ అంతా కూడా ఆ ట్యూన్ విని ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇలా రెహమాన్ ఇప్పటికే రామ్ చరణ్ సినిమా పనులను ప్రారంభించినట్లు సమాచారం.

ఇకపోతే ప్రస్తుతం చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: