తాజాగా రామ్ పోతినేని హీరోగా శ్రీ లీలా హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సాయి మంజ్రేకర్ ఓ కీలకమైన పాత్రలో నటించగా ... శ్రీకాంత్ , ప్రిన్స్ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఇకపోతే తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ సినిమాకి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.57 కోట్ల షేర్ ... 17.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ సినిమాకి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల షేర్ ... 7.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇక మొత్తంగా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 14.57 కోట్ల షేర్ ... 24.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 46.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 47 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 32.43 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ఫార్మల ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్ లను సాధిస్తుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ సినిమా డీసెంట్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది.