ప్రభుత్వ రంగ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా 19 కేజీల వాణిజ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను అకస్మాత్తుగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మొన్నటి వరకు డొమెస్టిక్ సిలిండర్ లపై ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం నిన్నటి నుంచి కమర్షియల్ సిలిండర్లపై ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిన్నటి నుంచి పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు అమలులోకి వచ్చాయి. ఇక ఈ కమర్షియల్ సిలిండర్ పై సుమారుగా రూ.209 పెరగడంతో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.1731.50 కి చేరుకుంది. సాధారణంగా ప్రతి నెల ఒకటవ తేదీన ఎల్పిజి గ్యాస్ ధరను పెంచడం లేదా తగ్గించడం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ గృహ అవసరాల సిలిండర్ ధరను ఇప్పుడు పెంచలేదు.

తాజాగా మోడీ ప్రభుత్వం గృహ వినియోగ సిలిండర్ల ధరలను రూ.200 మేరా తగ్గించి సామాన్యులకు శుభవార్త అందించింది .అయితే ఇప్పుడు ఆయిల్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరపై ఏకంగా రూ.209 పెంచడంతో ఇప్పటికే ఆహార ధాన్యాల ధరల పెరుగుదలతో నష్టపోతున్న హోటల్ వ్యాపారులు,  ఇతర ఆహార పరిశ్రమలు ఇప్పుడు మరింత నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 2023లో చమురు కంపెనీలు దేశీయ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలలో పెద్ద కోత విధించగా గత నెలలో 19 కిలోల సిలిండర్ ధర రూ .158 వరకు తగ్గింది.

దీని తర్వాత రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1522 కి చేరుకోగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదల ప్రభావం వల్ల హోటల్ రెస్టారెంట్లలో తినడం మరియు తాగడం కూడా ఇప్పుడు ఖరీదయింది. ఎందుకంటే ఒకవైపు ఆహార ధాన్యాలు ధరలు పెరగడంతో పాటు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా ధరలు పెరగడంతో ఎటు చూసినా సామాన్యుడికే ముప్పు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక వీటి ధరల పెంపకం వల్ల రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు కూడా పెంచేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: