హాట్ బ్యూటీ హనీ రోజ్ ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటుంది అన్న విషయం తెలిసిందే. తన అందం అభినయంతో ఇప్పటికే తెలుగు కుర్రకారూ మతి పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ  టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సినిమాల్లో కూడా అలరిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. ముఖ్యంగా బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టులోకి వచ్చేసింది ఈ బ్యూటీ. అయితే వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అయింది.


 కానీ ఈ సినిమా తర్వాత హనీ రోజ్ కి మాత్రం చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు అని చెప్పాలి. అయితే ఇప్పుడు కాస్త గ్యాప్ తర్వాత హాని రోజ్ ఒక బంపర్ ఆఫర్ అందుకుంది అన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోని ఒక కీలక పాత్రలో నటించేందుకు అవకాశాన్ని అందుకుందట హాని రోజ్. హరిష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. గతంలో హరిష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హాని రోజ్ ఒక కీలక పాత్రలో నటించేందుకు ఛాన్స్ దక్కించుకున్నట్టు ఒక వార్త వైరల్ గా మారిపోయింది. సాధారణంగా హాని రోజ్ అనగానే కాస్త ఎక్స్పోజింగ్ అని అనుకుంటారు అందరూ. కానీ ఎంతో డిగ్నిటీ ఉన్న రోల్లో కనిపించబోతుందట ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాలో మంచి పాత్ర దొరికిందని.. ఇక ఈ సినిమా హిట్ అయితే హనీ రోజ్ నటిగా మరో మెట్టు పైకి ఎక్కుతుందని ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత హనీ రోజ్ కి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది అని అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: