
తాజాగా సలార్ సినిమా గురించి కొన్ని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అవి ఏమిటంటే ఈ సినిమా ట్రైలర్ సైతం రెండు ట్రైలర్గా విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి ఈ నెలలో విడుదల విడుదల కాబోతూ ఉండగా మరొకటి దీపావళి రోజున విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ విషయం తెలిసి పలువురు అభిమానులు సైతం ఫుల్ ఖుషి గా ఉంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో వైరల్ గా మారుతోంది.
త్వరలోనే ఈ విషయం పైన చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. జగపతిబాబు కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిస్తున్న సలార్ సినిమా పైన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు అయితే సలార్ సినిమా విడుదలయ్యే రోజునే షారుఖ్ ఖాన్ నటిస్తున్న డుంకి చిత్రం కూడా విడుదల కాబోతూ ఉండడంతో ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు ఒకేరోజు విడుదల అవుతే ఎలా అంటూ పలువురు సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు. మరి ఏం జరుగుతుందని విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.