ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉన్న ముద్దుగుమ్మలలో ఒకరు మీనాక్షి చౌదరి. ఈ నటి సుశాంత్ హీరోగా రూపొందిన ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ తర్వాత ఈ నటి రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి ... అడవి శేషు హీరోగా రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ అనే రెండు తెలుగు మూవీ లలో నటించింది. ఇందులో ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ మూవీ లో తన అందాలను ఆరబోసి ప్రేక్షకులను అలరించి హిట్ 2 మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇకపోతే తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ , తమిళ క్రేజీ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో ఓ మూవీ మరి కొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ నటి సినిమాల్లో ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా మీనాక్షి అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: