పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ సినిమా ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతం జరుగుతోంది.ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండేది. అయితే ప్రశాంత్ నీల్ అవుట్ పుట్ విషయంలో సంతృప్తికరంగా లేకపోవడంతో రిలీజ్ ని వాయిదా వేసేశారు. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా సినిమాని రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ రెండు భాగాలుగా సలార్ ని నిర్మిస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ సినిమాగా దీనిని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ నుంచి ఇప్పటి వరకు సాలిడ్ బ్లాక్ బస్టర్ మూవీ రాలేదు. సలార్ సినిమా ఆ కోరిక తీరుస్తుందని ఆశిస్తున్నారు.


అందుకు తగ్గట్లుగానే మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచడానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ పెర్ఫెక్ట్ స్ట్రాటజీతో ముందుకి వెళ్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న సలార్ సినిమా ట్రైలర్ రిలీజ్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ ని మూవీపై అమాంతం అంచనాలు పెంచేలా డిజైన్ చేస్తున్నారట. ఇక ఈ ట్రైలర్ తర్వాత రిలీజ్ ముందు సెకండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. ఇలా రెండు ట్రైలర్స్ ని రిలీజ్ చేయడంతో ద్వారా సినిమాని ఆడియన్స్ కి దగ్గర చేయడం సులభం అవుతుందనే అంచనా వేస్తున్నారంట. ఇప్పటికే ఈ మూవీపై భారీ ఎత్తున బిజినెస్ జరిగింది. ఇంకా దానికి తగ్గట్లుగానే బెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ రావడాలంటే కచ్చితంగా సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉండాలి.అందుకోసమే సలార్ టీమ్, ప్రశాంత్ నీల్ ఇలా రెండు ట్రైలర్స్ సిద్ధం చేస్తున్నారని సమాచారం తెలుస్తోంది. మరి ఈ స్ట్రాటజీ సలార్ మూవీకి ఎలాంటి హిట్ ని తీస్తుకోస్తుంది అనేది వేచి చూడాలి. సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: