
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా 800 అనే టైటిల్ తో బయోపిక్ తెరకెక్కింది. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది అన్న విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా రికార్డు సృష్టించిన ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రాబోతుంది. అయితే ఇక ఈ సినిమాను సచిన్ టెండూల్కర్, ముత్తయ్య మురళీధరన్, వివిఎస్ లక్ష్మణ్, సౌరబ్ గంగూలీ లాంటి దిగ్గజాలు ప్రమోట్ చేయడంతో సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పాలి ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ను నిర్మాత శివాయంక ప్రసాద్ బయట పెట్టాడు.
800 సినిమా కథను ముందుగా నాచురల్ స్టార్ నానితో చేయాలి అనుకున్నాము అంటూ చెప్పకొచ్చాడు. అతనికి కథ కూడా వినిపించామని ఆయనకు కూడా స్టోరీ బాగా నచ్చింది. అయితే అప్పటికి జెర్సీ రిలీజ్ అయి ఏడాదిన్నర మాత్రమే అయింది. దీంతో నాని ఇంతలోనే క్రికెట్ బ్యాగ్రౌండ్ లో ఉన్న మరో సినిమా అంటే రెడీగా లేను అని చెప్పాడు. దీంతో ఏమీ చేయలేకపోయాం అంటూ తెలిపాడు. ముందుగా విజయ్ సేతుపతితో సినిమాను ప్లాన్ చేసి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన తర్వాత తమిళనాడులో నిరసన సెగతో విజయ్ తప్పుకున్నాడు. ఇక ఆ ప్లేస్ లో స్లమ్ డాగ్ మెలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ ను ఫైనల్ చేశారు.