
2010 జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా 13 ఏళ్ల కిందట వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఫుల్ టైం కామెడీగా ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీగా విజయాన్ని అందుకోవడం గమనార్హం. ముఖ్యంగా ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే ఇప్పటికీ కూడా ప్రేక్షకులు అక్కడి నుంచి కదలరు అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటూ అభిమానుల సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వివి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఇక ఈ చిత్రాన్ని వల్లభనేని వంశీ కొడాలి నాని నిర్మించిన విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా రెండు పాత్రల్లో కూడా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలై 13ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2023 నవంబర్ 18 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచిన ఈ సినిమాని మరొకసారి ఆదరిస్తారని అభిమానులు చెబుతున్నారు.